Guntur: గణేష్ నిమజ్జనంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల బాహాబాహీ
Guntur: మాజీ ఎంపీటీసీ ఇంట్లోకి చొరబడి వైసీపీ కార్యకర్తల దాడి
Representational Image
Guntur: గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెదనందిపాడు మండలం కొప్పర్రులో అర్థరాత్రి వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వినాయక నిమజ్జనం జరుగుతుండగా ఈ వివాదం తలెత్తింది. మాజీ ఎంపీటీసీ వేణు ఇంట్లోకి చొరబడ్డ వైసీపీ కార్యకర్తలు అడ్డం వచ్చినవారిని ఇష్టమొచ్చినట్టు చితకబాదారు. ఇంట్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం పెట్రోల్ పోసి తలగబెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తలు ఎదురుతిరిగారు. ఒకరిపై మరొకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.