జోగి బ్రదర్స్‌కు మూడు రోజుల కస్టడీ

విజయవాడ జైలులో జోగి బ్రదర్స్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌ అరెస్టు కాగా.. మూడు రోజుల కస్టడీకి తంబళ్లపల్లె న్యాయస్థానం అనుమతించింది.

Update: 2026-01-02 08:58 GMT

విజయవాడ జైలులో జోగి బ్రదర్స్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌ అరెస్టు కాగా.. మూడు రోజుల కస్టడీకి తంబళ్లపల్లె న్యాయస్థానం అనుమతించింది. నేటి నుంచి మూడు రోజులపాటు జోగి రమేష్, జోగి రాములను అధికారులు విచారించనున్నారు. అయితే నకిలీ మద్యం కేసులో జనార్థన్ రావు, జగన్మోహన్ రావు సోదరులకు జోగి బ్రదర్స్ అండగా ఉన్నారని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వారి అక్రమాలకు జోగి బ్రదర్స్ అన్ని విధాల సహాయ సహకారాలు అందించినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారిపై ఆరోపణలను మోపారు. అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించిన ఎక్సైజ్ అధికారులు గతేడాది నవంబరులోనూ జోగి బ్రదర్స్ ను విచారించారు. మరిన్ని ఆధారాలను సేకరించేందుకు మరోమారు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.

Tags:    

Similar News