ఎలమంచిలి తిమ్మరాజుపేటలో దసరా ఉత్సవాలు.. ముఖ్య అతిధిగా హాజరైన వ్యాపారవెత్త ఎంవీఆర్

కుమారునితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజల నిర్వహణ.. ఎంవీఆర్‌ను సన్మానించిన జగ్గరావు మిత్రమండలి

Update: 2022-10-05 13:30 GMT

ఎలమంచిలి తిమ్మరాజుపేటలో దసరా ఉత్సవాలు.. ముఖ్య అతిధిగా హాజరైన వ్యాపారవెత్త ఎంవీఆర్

Andhra Pradesh: ఎలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట గ్రామంలో దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగ్గరావు మిత్రమండలి ఆహ్వానం మేరకు..వ్యాపారవెత్త ఎంవీఆర్ గ్రూప్ చైర్మెన్ ముత్యాల వెంకటేశ్వరరావు దసరా నవరాత్రులకు హాజరయ్యారు. ముత్యాల వెంకటేశ్వరావు, తనయుడు ముత్యాల సతీష్ తో కలిసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60 జంటలకు నిర్వహించిన షష్టిపూర్తి జంటలకు ముత్యాల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా సన్మానాలు చేశారు. అనంతరం జగ్గరావు మిత్రమండలి ముత్యాల వెంకటేశ్వరావుకు శాలువ కప్పి గజమాలతో సత్కరించారు.

Tags:    

Similar News