Dokka Manikya Vara Prasad: ఆ ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా
Dokka Manikyavaraprasad: ముంబై నటి జెత్వానీ కేసులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
Dokka Manikya Vara Prasad: ఆ ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా
Dokka Manikyavaraprasad: ముంబై నటి జెత్వానీ కేసులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురు IPS లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అన్ని మహిళా సంఘాలు.. పార్టీలకు అతీతంగా దీన్ని సమర్థించాల్సిన అవసరం ఉందని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
ముగ్గురిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని.. వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. స్వచ్చంధంగా ఐపీఎస్‌లు రాజీనామా చేసి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వలనే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం పెరుగుతోందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. అధికారుల చేత నటి జెత్వానీని అరెస్టు చేయించిన సజ్జలను అరెస్ట్ చేయాలన్నారు.