అన్యాయపూరిత సర్వే చేస్తే శాఖాపరమైన చర్యలు

నియోజకవర్గం ప్రభుత్వం జగనన్న చేదోడు పథకాలలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగేలా సర్వే చేస్తే సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపిడిఓ వి.శాంతామణి హెచ్చరించారు.

Update: 2020-02-22 14:46 GMT

పి. గన్నవరం: నియోజకవర్గం ప్రభుత్వం జగనన్న చేదోడు పథకాలలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగేలా సర్వే చేస్తే సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపిడిఓ వి.శాంతామణి హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం గ్రామ సచివాలయ డిజిటల్,సంక్షేమ అధికారులకు ఆమె జగనన్న చేదోడు పథకంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పథకాలలో దుకాణాలు ఉన్న రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు వారి అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక చేయాలని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంత లబ్ధిదారుల నెలసరి ఆదాయం అన్ని వనరులతో కలిపి 10,000 లోపు ఉండాలని ఆమె సూచించారు. గతంలో నిర్వహించిన సర్వే మరల సర్వే చేయాలని ఉన్నతాధికారులు నుండి ఆదేశాలు వచ్చాయని అందువల్ల ఎంతో పారదర్శకంగా సర్వే చేయాలని ఆమె సూచించారు. సర్వేలో అన్యాయపూరిత నివేదికలు, ఉద్యోగులు ఇచ్చినట్లయితే సంబంధిత ఉద్యోగులు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈ. ఓ. పి. ఆర్ .డి ,బి. మమత, పంచాయతీ కార్యదర్శులు ఎస్. బి.శర్మ, ఎం. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News