గొల్లప్రోలు: కరోనా వ్యాధి కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున గొల్లప్రోలు పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు... అముజూరి రాంబాబు వారి సహకారంతో కమీషనర్ పి.సాయిబాబు ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సాయిబాబు మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను అందరూ పాటించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని... సామాజిక దూరం ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటర్ ఇన్స్పెక్టర్ ఎస్.వి.శివ లక్ష్మి, నగర పంచాయతీ సిబ్బంది, సానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.