ఏపీలో నవంబర్‌ 26న మహిళలకు పాడి పశువుల పంపిణీ

Update: 2020-11-19 13:10 GMT

వైఎస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాల ద్వారా అర్హులైన మహిళలకు ఆదాయాన్ని సమకూర్చేందుకు ఏపీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఈనెల 26న మహిళా లబ్దిదారులకు పాడి పశువులు, గొర్రెలు, మేకలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు ఆవులు, గేదెల కోసం 4.68 మంది మహిళలు, గొర్రెలు, మేకల కోసం 2.49 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5.63 లక్షల పాడి పశువులును కొనుగోలు చేసి జిల్లాలా వారీగా లబ్దిదారులకు పాడి పశువులు, పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. లబ్దిదారులకు ఈవ్వనున్న ప్రతి పశువును భౌతికంగా తనికీ చేసి. లబ్దిదారుల జాబితాను రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వర్చువల్ విధానంలో తొలి దశలో కడప, చిత్తూరు జిల్లాల్లో నాలుగు వేల గ్రామాల్లో పాడి పశువులు పంపిణీ చేయనున్నారు. 

Tags:    

Similar News