కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం.. జోరు వానలోనూ ఆగని కర్రల సమరం
కర్రల సమరంలో 50 మందికిపైగా గాయాలు.. విజయ దశమి సందర్భంగా కర్రల సమరం
కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం.. జోరు వానలోనూ ఆగని కర్రల సమరం
Kurnool: కర్నూలు జిల్లాలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరంలో భక్తులుపాల్గొన్నారు. ప్రతియేటా కర్రలతో ఒకరినొకరు పరస్పరం కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కర్రల సమరంలో పలువురికి తలలు పగిలాయి. రక్తస్రావం తీవ్రం కావడంతో సమీపంలోని ఆదోని ఆస్పత్రికి తరలించారు. కర్రల సమరంలో 50 మందికిపైగా గాయపడ్డారు. వర్షం కురుస్తున్నప్పటికీ సాంప్రదాయాన్ని వీడేది లేదరని కర్రల సమరానికి తలపడ్డారు. పరస్పరం కొట్టుకుని తలలను గాయపరచారు. చిందిన రక్తంతో ప్రయోజనం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.