బంగాళాఖాతంలో అల్పపీడనం..మే 13 నుంచి మోస్తరు వర్షాలు

అండ‌మాన్ స‌ముద్ర ప్రాంతాల్లో ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని అమ‌రావ‌తిలోని వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది.

Update: 2020-05-10 04:56 GMT
monsoons are coming (rep.image)

అండ‌మాన్ స‌ముద్ర ప్రాంతాల్లో ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని అమ‌రావ‌తిలోని వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది. ‌దక్షిణ అండమాన్‌ సముద్రం, సుమత్రా దీవుల్లోని మధ్యస్థ ట్రోపోస్పియర్‌ స్థాయి వరకు.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్ల‌డించింది. దీని ప్రభావంతో మే 13న ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో ఏర్పాడింది. రాగ‌ల 48 గంట‌ల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్ర తెలిపింది‌. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వ‌ల్ల ఏపీకి ఎంఫాన్ తుఫాను ముప్పు ఏపీకి తప్పిన విషయం తెలిసిందే.

మరో 20 రోజుల్లో నైరుతిరుతుపవనాలు కేరళ తీరానికి తాకనున్నాయి. మే 20 నాటికి రుతుపవనాలు అండమాన్ తీరాన్నితాకి శ్రీలంక మీదుగా కేరళకు చేరుతాయి. ఈ ప్రక్రియకు కనీసం 10 రోజులు పడుతుంది.

Tags:    

Similar News