Road Accident: మడకశిరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Road Accident: సత్యసాయి జిల్లా మడకశిరలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అగ్రంపల్లి గ్రామ సమీపంలో ఐచర్ వాహనాన్ని బొలెరో గూడ్స్ వాహనం ఢీకొట్టింది.
Road Accident: మడకశిరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Road Accident: సత్యసాయి జిల్లా మడకశిరలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అగ్రంపల్లి గ్రామ సమీపంలో ఐచర్ వాహనాన్ని బొలెరో గూడ్స్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు మహమ్మద్ రఫీక్, వడ్డే రఘులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.