సోంపేట: మండలలోని ఎర్రముక్కం, సిరిమామిడి, తోటూరు గ్రామాల్లో 650 కుటుంబాలకు కూరగాయలు, మాస్కలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంలో నిత్యవసర సరుకుల కొరకు పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వైసీపీ మండల అధ్యక్షులు తడక జోగరావు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిమామిడి మాజీ సర్పంచ్ రాజేశ్వరమ్మ, కూర్మరావు, కృష్ణ, శంకర్, సింహాచలం, మాధవరావు, యాదవ రావు, లక్ష్మి నారాయణ, డిలేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు కోసం ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.