Cyclone Montha: మెంటాడలో కస్తూరిబా స్కూల్ లోకి చంపావతి నది వరద నీరు
Cyclone Montha: విజయనగరం జిల్లాను మొంథా తుఫాన్ కుదిపేసింది. భారీ వర్షం, ఈదురు గాలులు తీవ్ర నష్టం తెచ్చి పెట్టింది.
Cyclone Montha: విజయనగరం జిల్లాను మొంథా తుఫాన్ కుదిపేసింది. భారీ వర్షం, ఈదురు గాలులు తీవ్ర నష్టం తెచ్చి పెట్టింది. జిల్లాలోని తెర్లాం, జామి, గుర్ల, వంగల, మెంటాడ మండలాల్లో భారీ పంట నష్టం వాటిల్లింది. మెంటాడలోని కస్తూరిబా పాఠశాలలోకి చంపావతి వరద నీరు వచ్చి చేరింది. పాఠశాలలో చదువుతున్న 208 మంది విద్యార్ధినులను సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ప్రత్యేక బస్సులో తరలించారు. అర్ధరాత్రి కావడంతో విద్యార్ధినులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అధికార యంత్రాంగం సహయక చర్యలు చేపట్టింది.