Cyclone Montha: పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మొంథా తుఫాన్.. గంటకు 10 కి.మీ వేగంతో కదులుతున్న తుఫాన్
Cyclone Montha: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుఫాన్‌గా కేంద్రికృతమైందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Cyclone Montha: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుఫాన్‌గా కేంద్రికృతమైందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతుంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 100 కిలోమీటర్లు, కాకినాడకు 109 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
ఇవాళ రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరందాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.