Cyclone Montha: ముంచుకొస్తున్న మొంథా తుఫాన్.. రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్

Cyclone Montha: మొంథా తుఫాన్ దూసుకువస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

Update: 2025-10-28 10:32 GMT

Cyclone Montha: మొంథా తుఫాన్ దూసుకువస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదిలి బంగాళాఖాతంలోనే తీవ్ర తుపానుగా మారనుంది. రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కొనసాగుతాయి.

తుపాను ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రెండురోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ఎఫెక్ట్‌తో కాకినాడ పోర్టకు 10 నెంబర్, విశాఖ పోర్ట్‌కు 9 నెంబర్, నర్సాపురం పోర్ట్‌కు 8 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

Tags:    

Similar News