Srikakulam: బీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్.. స్కూల్‌లోకి వెళ్లాలంటే గోడ దూకాల్సిందే
Srikakulam: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది.
Srikakulam: బీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్.. స్కూల్‌లోకి వెళ్లాలంటే గోడ దూకాల్సిందే
Srikakulam: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. తుఫాన్ ధాటికి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
నగరంలో వర్షపు నీరు నిలిచిన కారణంగా స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, స్థానిక తోలాపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Zilla Parishad High School) ప్రాంగణంలోకి భారీగా నీరు చేరింది.
దీంతో స్కూల్‌లోకి వెళ్లడానికి సరైన దారి లేక, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు (Students and Teachers) పాఠశాల ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. తుఫాన్ తెచ్చిన ఈ బీభత్సం విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.