తిరుమల కొండపై తిరునామంతో గోవు సంచారం

తిరుమలలో ఓ గోవు చూపరులను ఆకట్టుకుంటుంది. లాక్‌డౌన్ కావడంతో భక్తులకు శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

Update: 2020-04-29 15:40 GMT
Cow with Tirumala Balaji Thirunamam

తిరుమలలో ఓ గోవు చూపరులను ఆకట్టుకుంటుంది. లాక్‌డౌన్ కావడంతో భక్తులకు శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జన సంచారం లేకపోవడంతో కొండలపై వన్య ప్రాణులు, జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ నేథ్యంలో అలిపిరి వద్ద ఈ గోవు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వెంకటేశ్వర స్వామి తిరునామంతో ఉన్న ఓ గోవు కనిపించింది. స్వామివారు నుదట ధరించే తిరునామం మాదిరిగానే ఆ గోవుకు నుదుటిపై పెద్ద ఆకారంలో సహజసిద్ధంగా ఉంది. ఆకలితో అలమటిస్తున్న గోవులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి రోజూ గ్రాసం అందిస్తోంది.

అయితే ఈ గోవును టీటీడీ అధికారులు గోశాలకు తరలించినట్లు తెలుస్తోంది. నుదుటి పై తిరునామం ఆకారంలో ఉన్న అరుదైన గోవును టీటీడీ అధికారులు గోశాలకు తరలిస్తే భక్తులు వీక్షించడానికి బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత నెల 20 వ తేదీ నుంచి రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతివ్వడం లేదు. స్వామివారికి కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆదాయం కోల్పోయింది. 


Tags:    

Similar News