Coronavirus: 50ఏళ్ల లోపువారికి ఇంట్లోనే చికిత్స
కరోనా చికిత్సలో సరికొత్త నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. కరోనా లక్షణాలు ఉండి, 50ఏళ్ల లోపువారికి ఇంట్లోనే చికిత్స పొందేందుకు వీలుగా ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా చికిత్సలో సరికొత్త నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. కరోనా లక్షణాలు ఉండి, 50ఏళ్ల లోపువారికి ఇంట్లోనే చికిత్స పొందేందుకు వీలుగా ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనల తో కూడిన మార్గదర్శకాలు జారీ చేసింది. 50 ఏళ్ల లోపు వారు కరోనా స్వల్ప లక్షణాలు ఉంటే..చికిత్స పొందేందుకు వైద్యుని సిపారసుతోనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.
కోవిడ్ ఆసుపత్రికి సమీపంలో ఉండాలిని తెలిపింది. పలు నిబంధనల ప్రకారం ఇంట్లో ప్రత్యేక వసతులు ఉండాలి..గది,బాత్ రూమ్ లాంటివి ఉండాలి.14 రోజుల స్వీయనిర్బంధంలో ఉండాలి పేర్కొంది. ఇతరులకు సోకకుండా భూతిక దూరం పాటించడమే పరిష్కారం అని తెలిపింది.
అపార్ట్ మెంట్లలో నివాసం ఉండే వారికి , ఉమ్మడి కుటుంబం అయినా చికిత్స పొందేందుకు అనుమతి ఉండదు. కరోనా లక్షణాల ఉన్న వ్యక్తి ఇంట్లో 60 సంవత్సరాల వయసు అంతకు మించిన వయసు గలవారు ఉండకూడదు.. అవసరమైన సమయంలో వీడియో కాల్ ద్వారా రోగి వైద్యులతో మాట్లాడేందుకు అవకాశం ఉండాలి. కాగా..ఏపిలో లక్షకు చేరువలో కరోనా టెస్ట్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ రేటు 1.4 శాతం ఉంది. 10 రోజుల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. కర్నూల్,గుంటూరు,కృష్ణా లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలని కేంద్రం రెడ్ జోన్ గా ప్రకటించింది. గురువారం రోజుకి 1403 కి చేరిన పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
కర్నూలు386, గుంటూరు287, కృష్ణా246,నెల్లూరు84,చిత్తూరు80, కడప73, అనంతపురం61,ప్రకాశం60, పశ్చిమగోదావరి 56, తూర్పుగోదావరి.42,విశాఖ23,శ్రీకాకుళం5 కేసుల నమోదు అయ్యాయి.