Nellore: అత్యాధునిక విధానంలో కరోనా నివారణా చర్యలు

Update: 2020-04-16 05:58 GMT

నెల్లూరు: నగరంలో కరోనా వైరస్ ప్రభావానికి గురై, రెడ్ జోన్ కేంద్రాలుగా ప్రకటించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అత్యాధునిక పరికరాలతో నివారణా చర్యలను చేపట్టామని కమిషనర్ పివివిఎస్ మూర్తి ప్రకటించారు. స్థానిక 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో ఆయన పర్యటించి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బి.హెచ్.ఈ.ఎల్) కంపెనీకి చెందిన భెల్ మిస్టర్ యంత్రం పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ యంత్రం ద్వారా కరోనా వైరస్ ను నివారించే సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని, అత్యంత సమర్ధవంతంగా పిచికారీ చేయవచ్చని తెలిపారు.

అపార్టుమెంట్లు, భవనాలు వంటి ఎక్కువ ఎత్తు కలిగిన ప్రదేశాల్లో సైతం, పూర్తిస్థాయిలో ద్రావకాన్ని పిచికారీ చేయగలిగే సామర్ధ్యాన్ని యంత్రం కలిగివుందని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా నగరంలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య కార్మికుల ద్వారా కరోనా వైరస్ నివారణకు ప్రత్యేక జాగ్రత్తలతో ద్రావకం పిచికారీ ప్రక్రియను నిరంతరం చేపడుతున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజను పర్యవేక్షక అధికారి ఖాదర్ నవాజ్, నగర పాలక సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News