Coronavirus: కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. కేసులు తగ్గుముఖం..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి.. అంతేకాదు కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న సంఖ్య కూడా రెట్టింపవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి.. అంతేకాదు కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న సంఖ్య కూడా రెట్టింపవుతోంది. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 వరకు మొత్తం 8,388 మందిని పరీక్షించగా.. 43 మందికి పాజిటివ్ వచ్చింది. అంతకుముందు ఈ సంఖ్య 60గా ఉంది. ఇక శనివారం వైరస్ బారి నుంచి కోలుకుని 45 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన రోజువారీ బులెటిన్‌లో పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంథాలో ప్రస్తుతం 999 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,65,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1,930కి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇన్‌ఫెక్షన్ రేటు 1.17శాతంగా ఉంది. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారు 887 మంది ఉండగా. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 44కి చేరింది.