coronavirus updates: విశాఖ జిల్లాలో కరోనా కేర్ సెంటర్స్

Update: 2020-06-30 08:49 GMT

coronavirus updates: విశాఖలో మహమ్మారి కరోనా విజృంభిస్తుంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతోన్న కరోనా బాధితుల కోసం కోవిడ్ కేర్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా ఉధృతితో విశాఖలో బాధితుల సంఖ్య వెయ్యికి చేరువైంది. ఇప్పటికే మహమ్మారి ధాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు దాదాపు నగరమంతా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. నానాటికి పెరుగుతోన్న బాధితుల చికిత్స కోసం కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 1,000 పడకలు అందుబాటులోకి వచ్చాయంటోన్న అధికారులు మరో 5,000 పడకల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని చెప్తున్నారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఖర్చు భరించలేని వారికోసం కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్సను ఫ్రీగా అందించనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాలో గీతం, గాయత్రి, విమ్స్ లాంటి ప్రధాన కోవిడ్ హాస్పిటల్స్ లో దాదాపు 6,000 పడకలు సిద్దంగా ఉన్నాయని కోవిడ్ కేర్ సెంటర్లతో మరో 6,000 పడకలు అందుబాటులోకి వస్తాయంటోన్నారు అధికారులు.

ఏదేమైనా విశాఖలో కరోనా వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో కోవిడ్ కేర్ సెంటర్లు కాస్త ఊరట కలిగించినప్పటికీ కరోనా నియంత్రణకు ప్రభుత్వం మరిన్నీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లావాసులు.

Tags:    

Similar News