విశాఖలో విషవాయు పరిశ్రమలు లెక్క తేల్చండి : సీఎం జగన్
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ దుర్ఘటన తదితర పరిణామాలు సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు.
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ దుర్ఘటన తదితర పరిణామాలు సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. విశాఖలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎస్ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ విషాదం జరిగిన చోట పరిస్థితి అదుపులో ఉందని సీఎంకు తెలిపారు.ఈ సమీక్షలో కలెక్టర్ వినయ్ చంద్ పాల్గొన్నారు.
జనావాసాలకు దూరంగా విషవాయువులు ఉండే పరిశ్రమలను తరలించేందుకు తగు ఆలోచనలు చేయాలని సూచించారు. విశాఖలో విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్నిఉన్నాయో.. జనావాసాల మధ్య ఎన్ని ఉన్నాయన్న విషయాన్ని సమాచారం ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ఇక గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, తగు ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి క్రియాశీలకంగా ఉండాలని, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఆదేశించారు. ఘటనా ప్రాంతంలో ఉన్న రసాయనాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, లేకుంటే, ముడిపదార్థాలను పూర్తిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.