Andhra Pradesh: టీడీపీ సభ్యులపై సీఎం జగన్‌ ఫైర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి గందరగోళం ఏర్పడింది. వైసీపీ , టీడీపీ సభ్యులు తీవ్రంగా నిందించుకున్నారు.

Update: 2020-01-22 06:49 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి గందరగోళం ఏర్పడింది. వైసీపీ , టీడీపీ సభ్యులు తీవ్రంగా నిందించుకున్నారు. రైతు భరోసా కేంద్రాలపై చర్చను వైసీపీ సభ్యులు ప్రారంభించారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతికి మద్దతుగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంలోకి ప్రవేశించడాన్ని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ నాయకుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అసభ్యంగా ప్రవర్తించినందుకు టీడీపీ సభ్యులపై విరుచుకుపడ్డారు.

టీడీపీ నాయకులు రైతులు అభివృద్ధి చెందాలని కోరుకోరు, అందువల్ల వారు సభను నిలిపివేయడానికి వీధి రౌడీల వలె వ్యవహరిస్తున్నారు. మా 151మంది ఎమ్మెల్యేలు ఓపిగ్గా ఉంటే..10మంది టీడీపీ సభ్యులు పోడియం మీదికి వస్తున్నారు. టీడీపీ దిక్కుమాలిన పార్టీ. భద్రతగా మీరు మార్షల్స్‌ను ఉపయోగించుకోండి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం రింగ్‌ దాటి వస్తే మార్షల్స్‌... ఆందోళన చేసేవారిని అక్కడ నుంచి అటువైపే బయటకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పీకర్‌ను అభ్యర్థించారు. తొలుత టీడీపీ సభ్యులు వారి సీట్లలో కూర్చోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ టీడీపీ సభ్యులు శాంతించలేదు. తరువాత స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్ టీడీపీ సభ్యులను పోడియం నుండి వారి సీట్ల వద్దకు తీసుకొచ్చారు. 



Tags:    

Similar News