గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం, ప్రతిపక్షనేత

Update: 2020-01-26 05:14 GMT

నేడు గణతంత్ర దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో మనరాజ్యాంగం ఒకటి. దేశపౌరుల హక్కులను పరిరక్షించడంలో, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించింది. ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకందించిన మహనీయులను స్మరించుకుంటూ దేశపౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పేర్కొన్నారు.

అలాగే ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్వీట్ చేశారు.. అందులో 'రాజ్యాంగానికి న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వాలే మూలస్తంభాలు.ఏ పాలనలో అయినా ప్రజలకు ఇవి అందని నాడు మహనీయుల త్యాగాలకు అర్థంలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులే అమరావతి విషయంలో రాష్ట్రప్రజలకు న్యాయంచేస్తాయని విశ్వసిస్తూ, ప్రజలందరికీ 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పేర్కొన్నారు.

అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా.. దేశప్రజలందరికీ స్వేఛ్చ, సమానత్వాలను అందించడానికి మహనీయులు రూపొందించిన రాజ్యాంగానికి సమర్థుల పాలనలోనే పరిపూర్ణత చేకూరుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొనిఉన్న ప్రజాస్వామ్య సంక్షోభాన్ని రాజ్యాంగమే సరిదిద్దగలదని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలిపారు.

 

Tags:    

Similar News