తన వద్ద ఉన్న శాఖను మంత్రి మేకపాటికి అప్పగించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద ఉన్న శాఖను పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అప్పగించారు.

Update: 2020-05-01 02:53 GMT
YS Jaganmohan Reddy (File photo)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద ఉన్న శాఖను పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అప్పగించారు. సీఎం వద్ద ఉన్న పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ బాధ్యతలను గౌతమ్ రెడ్డికి కేటాయించారు. ఈ మేరకు సంబంధించిన ఉత్తర్వులు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని జారీ చేశారు. గౌతమ్‌రెడ్డి ప్రస్తుతం ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలతో పాటు మౌలిక వసతుల శాఖ బాధ్యతలు కూడా మేకపాటి చూసుకోనున్నారు.

గతంలో కూడా మంత్రులకు కేటాయించిన శాఖల విషయంలో చిన్న మార్పులు జరిగాయి. మంత్రి మోపిదేవి మార్కెటింగ్‌ శాఖను, మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆహారశుద్ధి విభాగాన్ని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు అప్పగించారు. సీఎం వైఎస్ జగన్‌ పాలనాపరమైన సౌలభ్యం కోసం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

మేకపాటి గౌతమ్ రెడ్డి 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి పోటీచేసి విజయం సాధించారు. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా గౌతమ్ రెడ్డిపై నమ్మకంతో జగన్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

Tags:    

Similar News