CM Jagan: సీఎం జగన్ సుడిగాలి పర్యటనలు
CM Jagan: బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జగన్ క్యాంపెయిన్
CM Jagan: సీఎం జగన్ సుడిగాలి పర్యటనలు
CM Jagan: వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రతి రోజూ మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ....తన ఎన్నికల మేనిఫేస్టోను ప్రజలకు వివరిస్తూ... విపక్ష పార్టీలపై జగన్ విరుచుకుపడుతున్నారు. తనకు ఓట్లేస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెబుతున్నారు. గత నెల 28వ తేదీ నుంచి సీఎం జగన్ వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.
కాసేపట్లో సీఎం జగన్...విజయనగరం లోక్‌సభ నియజకవర్గంలోని బొబ్బిలిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పాయకరావుపేటలో జరిగే సభలో పాల్గొంటారు. ఏలూరులో జరిగే బహిరంగ సభలో వైసీపీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తారు.