Jagan: తుపానుపై కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Jagan: తుపాను తగ్గిన 24 గంటల్లో వీటిని అందివ్వాలి

Update: 2023-12-04 08:49 GMT

Jagan: తుపానుపై కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Jagan: మిచౌంత్‌ తుపాను ప్రభావంపై కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో 181 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని అధికారులు సీఎంకు వివరించగా.. శిబిరాల్లో మంచి సౌకర్యాలు అందించాలని తెలిపారు సీఎం. ప్రజల అవసరాలకు తగిన విధంగా మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలన్నారు. ఇళ్లలోకి నీరు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, కూరగాయలు ఇవ్వాలని ఆదేశించారు. గుడిసెలు కూలిన వారికి 10 వేల రూపాయల ఆర్థికసాయం ఇవ్వాలన్నారు.

Tags:    

Similar News