CM Jagan: నేడు కురుపాంలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: 4వ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం
CM Jagan: నేడు కురుపాంలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ఇవాళ పార్వతీపురం జిల్లా కురుపాంలో సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. 4వ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తల్లుల ఖాతాలో నగదు జమచేయనున్నారు. 42 లక్షల 61వేల 965 మంది తల్లులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టిన సీఎం జగన్ నాలుగేళ్లలో విద్యా రంగంపై 66,722.36 కోట్లను వెచ్చించారు.
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు. కాగా విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తూ జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు టెన్త్, ఇంటర్‌లో ఉత్తీర్ణులు కాకపోయినా తిరిగి తరగతులకు హాజరైతే వారికి కూడా అమ్మ ఒడిని వర్తింపచేయాలని నిర్ణయించారు.