CM Jagan: డిసెంబర్ లోగా విశాఖలో ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి

CM Jagan: ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరించాలన్న జగన్

Update: 2023-07-06 14:10 GMT

CM Jagan: డిసెంబర్ లోగా విశాఖలో ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి 

CM Jagan: కోర్టు కేసులతో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిన చోట భూసేకరణపై దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ లో గృహ నిర్మాణ పనులపై జగన్ సమీక్ష జరిపారు. సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణ పనులపై సీఎంకు అధికారులు వివరించారు. కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయిందని వివరించారు. సీఆర్డీఏలో ఇళ్ల నిర్మాణంపై కోర్టు విచారణ అంశాన్ని జగన్ వద్ద అధికారులు ప్రస్తావించారు.

విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తి కావాలని జగన్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ లోగా విశాఖలో ఇళ్ల నిర్మాణం పూర్తికి కార్యాచరణ చేపట్టాలని కోరారు. టిడ్కో ఇళ్ల వద్ద వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సీఎం జెండా పచ్చజెండా ఊపారు.

Tags:    

Similar News