Jagan: చిన్నారికి పేరు పెట్టిన సీఎం జగన్.. ఏం పేరు పెట్టారంటే..!
Jagan: రాజశేఖర్ గా నామకరణం చేసిన సీఎం
Jagan: చిన్నారికి పేరు పెట్టిన సీఎం జగన్..
Jagan: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీఎం జగన్ పర్యటనలో ఆసక్తికర సంఘలన చోటుచేసుకుంది. స్థానిక లూధరన్ గ్రౌండ్స్ హెలిపాడ్ వద్ద చిట్టూరి సోనీ, చిట్టూరి మోహన్ కుమార్ దంపతులు వారి ఐదు నెలల చిన్నారితో సీఎంను కలిసారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే తమ కుటుంబానికి ఎంతో అభిమానమని సీఎంతో చెప్పారు. తమ బిడ్డకు పేరు పెట్టాల్సిందింగా సీఎంను కోరారు. వెంటనే చిన్నారిని భుజానికి హత్తుకుని ముద్దాడిన సీఎం రాజశేఖర్ అని పేరు పెట్టారు. దీంతో దంపతుల ఆనందానికి అవుదుల్లేవని చెప్పాలి.