CM Jagan: విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ విచారం.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం..
CM Jagan: మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
CM Jagan: విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ విచారం
CM Jagan: విజయవాడ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సంపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంపై సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీసీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం జగన్ అదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని...గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.