CM Jagan: చంద్రబాబు ప్రచారం చేసుకోవడం తప్ప.. చేసిందేమీ లేదు
CM Jagan: చంద్రబాబు పేదల వ్యతిరేకి అందుకే పట్టాలివ్వలేదు
CM Jagan: చంద్రబాబు ప్రచారం చేసుకోవడం తప్ప.. చేసిందేమీ లేదు
CM Jagan: గుడివాడ వేదికగా చంద్రబాబు, పవన్ పై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం జగన్.. పక్కన రెండు పార్టీలు ఉంటే గానీ లేవనేని చంద్రబాబు...జిత్తులు..ఎత్తులు..పొత్తులనే నమ్ముకున్నాడని మండిపడ్డారు.చంద్రబాబు పేదల వ్యతిరేకి కాబట్టే.. టీడీపీ హయాంలో పట్టాలివ్వలేదన్నారు. ఇక పవన్ వారాహి విజయ యాత్రపైనా సెటైర్లు వేశారు జగన్. చంద్రబాబు కోసమే పుట్టినట్లు దత్తపుత్రుడు వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. తోడేళ్లు అందరూ కలిసినా భయపడే ప్రసక్తే లేదని.. ప్రజల ఆశీస్సులు, అండతో దుష్టచతుష్టయాన్ని ఎదుర్కొంటామన్నారు సీఎం జగన్.