Chandrababu: తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు..ఐక్యత కావాలి
Chandrababu: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఘర్షణలు, విద్వేషాలు కాకుండా ఐక్యత వెల్లివిరియాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
Chandrababu: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఘర్షణలు, విద్వేషాలు కాకుండా ఐక్యత వెల్లివిరియాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. 'తెలుగు మహాసభ'లో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ.. ఉమ్మడి ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
నదుల అనుసంధానంపై చంద్రబాబు తన దూరదృష్టిని వివరించారు. ఏటా కృష్ణా, గోదావరి నదుల నుంచి వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలు కావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "దేశంలో నీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించాలంటే నదుల అనుసంధానం తప్పనిసరి. గంగా-కావేరి అనుసంధానంతో పాటు, దక్షిణాదిలో గోదావరి-పెన్నా నదులను కలపడం ద్వారా కరువును పారదోలవచ్చు" అని ఆయన పేర్కొన్నారు.
నీటి పంపకాలు, ఇతర అంతర్రాష్ట్ర అంశాల్లో తెలుగు వారు పరస్పర సహకారంతో మెదలాలని ఆయన సూచించారు. "తెలుగువారు ఎక్కడున్నా ఐక్యంగా ఉండాలి. విభజన సమస్యల కంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. నీటి వినియోగం విషయంలో వివాదాలు పక్కన పెట్టి, కలిసికట్టుగా నీటిని ఒడిసి పట్టుకుంటేనే భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది" అని చంద్రబాబు తెలిపారు.