CM Chandrababu: మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
CM Chandrababu: మరోసారి మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీలో ఎలాంటి మార్పు రాలేదంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
CM Chandrababu: మరోసారి మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీలో ఎలాంటి మార్పు రాలేదంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 18 నెలలైనా..చాలా మంది మంత్రుల పనితీరులో మార్పు రాలేదని చంద్రబాబు అన్నట్టు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతే కాకుండా ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్తే సంబంధిత పథకాలకి కేంద్ర నిధులు వస్తాయని.. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టమేమి లేదని చెప్పినట్టు తెలుస్తోంది.
ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా రాజధాని నిర్మాణం జరగకపోవడంతో ముఖ్యంగా అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. దీంతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతూ రివ్యూలు నిర్వహిస్తున్నారు. పనుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.