Chittoor: అతడికి 19.. ఆమెకు 38..కాలేజీలో చిగురించిన ప్రేమ..బెంగళూరుకు పలాయనం!

Chittoor Love Affair: తనకంటే రెట్టింపు వయస్సున్న మహిళను ప్రేమించి ఆమెతో కలిసి తప్పుకున్న 19 ఏళ్ల యువకుడి కథ ప్రస్తుతం చిత్తూరులో చర్చనీయాంశంగా మారింది.

Update: 2025-07-24 06:19 GMT

Chittoor: అతడికి 19.. ఆమెకు 38..కాలేజీలో చిగురించిన ప్రేమ..బెంగళూరుకు పలాయనం!

Chittoor Love Affair: తనకంటే రెట్టింపు వయస్సున్న మహిళను ప్రేమించి ఆమెతో కలిసి తప్పుకున్న 19 ఏళ్ల యువకుడి కథ ప్రస్తుతం చిత్తూరులో చర్చనీయాంశంగా మారింది. ఈ వింత ప్రేమకథలో చివరికి పోలీసులు మాద్యస్థం అవ్వాల్సి వచ్చింది.

చిత్తూరుకు చెందిన ఒక బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతుంటాడు. అదే కాలేజీలో 38 ఏళ్ల మహిళ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. భర్తతో విడాకులు తీసుకుని ఆమె ఒంటరిగా జీవిస్తోంది. కాలేజీలో ఈ ఇద్దరి మధ్య పరిచయం పెరిగి త్వరలో ప్రేమగా మారింది.

మే 24న యువకుడు ఇంట్లో వారికి బెంగళూరుకు ఇంటర్న్‌షిప్‌ కోసం వెళ్తున్నానని చెప్పి ఆ మహిళతో కలిసి వెళ్లిపోయాడు. అయితే కొద్దిరోజులు గడిచినా అతడు ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగి గాలింపు ప్రారంభించారు. శోధనలో అసలైన విషయం బయటపడడంతో జూలై 15న వారు చిత్తూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సీఐ నెట్టికంఠయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బెంగళూరులో ఉండగా వారిని గుర్తించి బుధవారం చిత్తూరుకు తీసుకొచ్చారు. అనంతరం ఇద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించి, వేర్వేరు ఇళ్లకు పంపించారు. ఈ ఘటన యువతలో భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు ఎంతటి పరిణామాలకు దారి తీస్తాయో మరోసారి చాటిచెప్పింది.

Tags:    

Similar News