YSRCP: వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇంచార్జ్ ల మార్పు
YSRCP: రాజోలు అసెంబ్లీ సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావు
YSRCP: వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇంచార్జ్ ల మార్పు
YSRCP: వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇంచార్జుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీకి సంబంధించి 11వ జాబితా విడుదల అయ్యింది. తాజాగా రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలను కొత్తగా నియమించారు. కర్నూలు పార్లమెంట్ సమన్వయ కర్తగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ కు రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావును నియమిస్తూ వైసీపీ అధిష్టానం నియమించింది.
గొల్లపల్లి సూర్యారేవు ఇటీవలే వైసీపీలో చేరారు. టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డితో భేటీ అయి వైసీపీలో చేరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రస్తుతం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అమలాపురం పార్లమెంట్ ఇంచార్జిగా ప్రకటించింది.