Chandrababu: 'జస్టిస్ ఫర్ వివేకా' అంటూ చంద్రబాబు ట్వీట్..

Chandrababu: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జస్టిస్ ఫర్ వివేకా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

Update: 2023-03-15 11:30 GMT

Chandrababu: ‘జస్టిస్ ఫర్ వివేకా’ అంటూ చంద్రబాబు ట్వీట్..

Chandrababu: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జస్టిస్ ఫర్ వివేకా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వివేకా హత్య..జగనాసుర రక్త చరిత్ర అని..పులివెందుల పూల అంగళ్ల నుంచి రాష్ట్ర ప్రజలందరికి తెలుసంటూ ట్వీట్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా ఒక్క పనికూడా చేయలేదన్నారు. చివరకు సొంత బాబాయ్‌ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంలో విఫలమయ్యారని చంద్రబాబు విమర్శించారు. తండ్రి పార్థీవ దేహం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి జగన్ అన్నారు. బాబాయ్ హత్యతో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి..ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్టర్ ద్వారా తెలిపారు.


Tags:    

Similar News