Chandrababu: కుప్పంలో చంద్రబాబు మూడోరోజు పర్యటన
Chandrababu: సాయంత్రం మల్లనూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద చంద్రబాబు బహిరంగ సభ
Chandrababu: కుప్పంలో చంద్రబాబు మూడోరోజు పర్యటన
Chandrababu: కుప్పంలో చంద్రబాబు మూడోరోజు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కురబ కులస్థులతో భేటీకానున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం కుప్పంలోని అన్న క్యాంటీన్ పరిశీలించనున్నారు. కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడున్నరకు కొత్తపేట మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం మైనార్టీలతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం మల్లనూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు.