Chandrababu: పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు
Chandrababu: ఐదేళ్ల అసమర్థ పాలనతో పోలవరం ప్రాజెక్టు మరుగునపడిపోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.
Chandrababu: పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు
Chandrababu: ఐదేళ్ల అసమర్థ పాలనతో పోలవరం ప్రాజెక్టు మరుగునపడిపోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరాన్ని వైసీపీ పాలనలో ఎలా విధ్వంసం చేయబడిందో వివరించారు. సమస్యలను, సవాళ్లను అధిగమించి ఐదేళ్లలో 72 శాతం పనులు పూర్తిచేశామని కానీ గత ఐదేళ్లలో 4 శాతం పనులు కూడా పూర్తికాలేదని తెలిపారు. తప్పుడు నిర్ణయాలు - రివర్స్ టెండర్ల డ్రామాలు ఆడారని చంద్రబాబు మండిపడ్డారు.