Chandrababu: ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి జగన్
Chandrababu: రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీడీపీ ప్రభుత్వమే
Chandrababu: ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి జగన్
Chandrababu: సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు.. 22 మంది ఎంపీలు.. 8 మంది రాజ్యసభలను ఇస్తే ఇప్పుడు ఎవరూ లేరని అంటున్నాడన్నారు. తనపై ఉన్న కేసుల మాఫీ.. ఫైరవీల కోసమే ముగ్గురు ఎంపీలను ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నాడని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ జోన్-4లో 175 నియోజకవర్గాల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలన్నారు. మొన్న వైసీపీ వై నాట్ 175 అన్నారని.. ఇప్పుడే మేం కూడా వై నాట్ పులివెందుల అంటున్నామన్నారు చంద్రబాబు.