Vijayawada: ఉలిక్కిపడేలా చేసిన విజయవాడ బస్టాండ్​ ఘటన.. సీసీ టీవీలో ప్రమాద దృశ్యాలు

Vijayawada: ఉలిక్కిపడేలా చేసిన విజయవాడ బస్టాండ్​ ఘటన.. సీసీ టీవీలో ప్రమాద దృశ్యాలు

Update: 2023-11-07 03:57 GMT

Vijayawada: ఉలిక్కిపడేలా చేసిన విజయవాడ బస్టాండ్​ ఘటన.. సీసీ టీవీలో ప్రమాద దృశ్యాలు

Vijayawada: విజయవాడ బస్టాండ్‌లో బస్సు బీభత్సం రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే తాజాగా ఆ బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. బస్సు డ్రైవర్​ తప్పిదం వల్ల బస్సు అకస్మాత్తుగా ముందుకు రావడం వీడియోలో తెలుస్తోంది. దానికి తోడు ప్రయాణికులు ఉన్న ఫుట్​పాత్​ ఎత్తు కూడా తక్కువగా ఉండటంతో బస్సు సరాసరీ ప్రయాణికుల మీదకు దూసుకు వెళ్లింది. అయితే ఈ విషాద ఘటనలో ఆరు నెలల చిన్నారి ఉండటం అందరినీ కలచివేసింది.

బస్సు బీభత్సాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు, స్టాళ్ల నిర్వాహకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేందుకు ఆటోనగర్‌ డిపోకు చెందిన మెట్రో లగ్జరీ నాన్‌ స్టాప్‌ బస్సు 24 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు 12 నెంబర్‌ ప్లాంట్‌ ఫాం వద్ద సిద్ధంగా ఉంది. బస్సును వెనెక్కి తీసేందుకు డ్రైవర్ గేర్‌ వేసి ఎక్స్‌లేటర్‌ తొక్కారు. కదలకపోవడంతో ఎక్స్‌ లేటర్‌ గట్టిగా తొక్కడంతో ఒక్కసారిగా బస్సు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఇనుప బారికేడ్లు, కుర్చీలు, స్తంభం తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బస్సు కింద పడి ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Tags:    

Similar News