Telugu Akademi: తెలుగు అకాడమి స్కాంలో దర్యాప్తు వేగవంతం

Telugu Akademi: తెలుగు అకాడమి స్కాంలో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Update: 2021-10-01 09:55 GMT

Telugu Akademi: తెలుగు అకాడమి స్కాంలో దర్యాప్తు వేగవంతం

Telugu Akademi: తెలుగు అకాడమి స్కాంలో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కుంభకోణానికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి, అక్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని అరెస్ట్ చేశారు. స్కాం ఇంటి దొంగల చేతివాటమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు బ్యాంక్‌ అధికారులతో చేతులు కలిపి నిధులు కాజేసినట్లు గుర్తించారు.

ఇప్పటివరకు 63 కోట్లు దారి మళ్లించినట్టు తెలుస్తోంది. కార్వాన్‌ యూనియన్‌ బ్యాంక్‌లో 43 కోట్లతో పాటు సంతోష్‌నగర్‌ బ్రాంచ్‌లో 10 కోట్లు, చందానగర్‌ కెనరా బ్యాంక్‌లో మరో 10 కోట్లు మాయమయ్యాయి.

నిధుల మాయంపై ఇప్పటివరకు 3 ఫిర్యాదులు చేశారు తెలుగు అకాడమి డైరెక్టర్‌ సోమిరెడ్డి. ఇక తెలుగు అకాడమిలో ముగ్గురు ఉద్యోగుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నగదు బదిలీ చేసిన బ్యాంక్‌ ఉద్యోగులను విచారిస్తున్నారు.

అలాగే యూనియన్ బ్యాంక్‌‌, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్‌, అగ్రసేన్‌ బ్యాంక్‌ ప్రతినిధులను విచారించారు. బదిలీ అయిన అకౌంట్‌ హోల్డర్స్‌ ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి బ్యాంక్‌ అధికారులు, అకాడమి ఉద్యోగులను పోలీసులు విచారించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News