టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు షాక్.. సీబీఐ విచారణ ఆదేశం

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యరపతినేని శ్రీనివాస్ రావుపై ఉన్న 18 కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ జరపాలని నిర్ణయిచింది

Update: 2019-12-24 16:49 GMT

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లాకు గురజాలకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై ఉన్న కేసులను సీబీఐకి అప్పగిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యరపతినేని శ్రీనివాస్ రావుపై ఉన్న 18 కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ జరపాలని నిర్ణయిచింది. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో యరపతినేని అక్రమంగా మైనింగ్ జరిపారని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

గుంటూరు జిల్లాలోని నడికుడి, కేసనుపల్లి, కోణంకి గ్రామాల్లో అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ జరపాలని పేర్కొంది. 1994, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. కాగా., 2014 ఎన్నికల్లో టీడీపీ ఆధికారం చేపట్టడంతో ఆయన పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలైయ్యారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీబీఐకు అప్పగిచ్చిన తొలి కేసు ఇదే కవడం గమనార్హం. అయితే మూడు నెలల కింద మైనింగ్ కేసులు సీబీఐకీ అప్పగించాలి కేబినెట్ నిర్ణయించింది. అయితే యరపతినేని కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం రాజకీయ పరిణామాలతో ఆ‍యన బయటకు వచ్చారు. మంత్రివర్గం నిర్ణయం మూడు నెలల తర్వాత ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

మరోవైపు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆధిక ఆదాయ వ్యవహారలపై ఈడీతో పాటు సీబీఐ దర్యాప్తు చేయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత మంత్రిత్వశాఖకు పంపినట్లు వార్తలు వచ్చాయి.

  Full View

Tags:    

Similar News