జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చిన సిబిఐ కోర్టు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసుపై నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది.

Update: 2020-01-24 08:05 GMT

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసుపై నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. గత వారం ముఖ్యమంత్రి జగన్ కు వ్యక్తిగత హాజరు కావడానికి మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ రోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నా.. ముఖ్యమంత్రి ప్రభుత్వ విధుల్లో బిజీగా ఉన్నందున, జగన్‌ కు ఈ శుక్రవారం కూడా విచారణకు హాజరుకాకుండా కోర్టు మినహాయింపు ఇచ్చింది. అయితే, జగన్ తరుపు న్యాయవాదులు, ఎంపీ విజయసాయి రెడ్డి విచారణకు హాజరయ్యారు.

మరోవైపు, ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఎఎస్ శ్రీలక్ష్మి, వర్ది రాజగోపాల్ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు మినహాయించాలని సిబిఐ ప్రత్యేక కోర్టును కోరారు. అయితే, నిందితుడు ఉన్నత స్థానంలో ఉన్నందున అతను సాక్షులను ప్రభావితం చేయగలడని పేర్కొంటూ సిబిఐ దీనికి వ్యతిరేకంగా వాదించింది. దాంతో ఈ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News