YS Avinash Reddy: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు
YS Avinash Reddy: హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరిన అవినాష్‌రెడ్డి
YS Avinash Reddy: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు
YS Avinash Reddy: కడప జిల్లా పులివెందులలోని ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్‌రెడ్డి బయల్దేరి వెళ్తుండటంతో.. ఇప్పటికే ఆయన ఇంటికి ఇద్దరు సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది. సీబీఐ నోటీసుల ప్రకారం.. ఇవాళ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నానని తెలిపారు అవినాష్ రెడ్డి. తనకు 3 నుంచి 4 రోజుల సమయం కావాలని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన సీబీఐ.. అవినాష్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని మార్చింది. ఈ నెల 19న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపింది.