Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ కస్టడీకి భాస్కర్ రెడ్డి

Viveka Murder Case: రేపటి నుంచి 24 వరకు సీబీఐ కస్టడీకి భాస్కర్, ఉదయ్ ను అనుమతించింది.

Update: 2023-04-18 11:30 GMT

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ కస్టడీకి భాస్కర్ రెడ్డి

Viveka Murder Case: మాజీమంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి కస్టడీకి అనుమతినిచ్చింది నాంపల్లి సీబీఐ కోర్టు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ కు 6 రోజుల సీబీఐ కస్టడీకి అంగీకరించింది. రేపటి నుంచి 24 వరకు సీబీఐ కస్టడీకి భాస్కర్, ఉదయ్ ను అనుమతించింది. వివేకా హత్య కేసులో ఉదయ్‌పై సాక్ష్యాధారాలు మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. భాస్కర్‌రెడ్డి ఆదేశాలతోనే వైఎస్‌ వివేకా హత్యకు కుట్ర జరిగిందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. సహ నిందితులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వివేకా హత్య జరిగిన ఘటనాస్థలంలో ఆధారాలు చెరిపివేయడంలో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, విజయ్‌ కుమార్‌రెడ్డితో కలిసి ఆధారాలు చెరిపివేయడంతో భాస్కర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని స్థానిక సీఐని భాస్కర్‌రెడ్డి బెదిరించారన్న ఆరోపణలు ఉన్నయన్నారు. ఇక.. ఈ కేసులో ఉన్న కీలక సాక్షులను భాస్కర్‌రెడ్డి తన అనుచరుల ద్వారా ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు అధికారులు. మరోవైపు.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. కాసేపట్లో అవినాష్ రెడ్డి పిటిషన్ పై తీర్పు వెలువడనుంది.

Tags:    

Similar News