Andhra Pradesh: టీడీపీని వీడటంపై స్పందించిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి

కొద్దిరోజులుగా టీడీపీ నేత, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీలోకి వెళతారంటూ వార్తలు వస్తున్నాయి.

Update: 2020-01-24 10:58 GMT

కొద్దిరోజులుగా టీడీపీ నేత, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీలోకి వెళతారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. తాను చంద్రబాబును వదిలి జగన్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదని అన్నారు. ఎప్పటికి టీడీపీని వీడనని స్పష్టం చేశారు. అంతేకాదు వైసీపీ నాయకులే ఇలాంటి ప్రచారాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారాయన. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకడం లేదని, కానీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన తనకెంతో మర్యాద ఇచ్చారని..

అలాంటి వ్యక్తిని వదిలి జగన్‌ ఇంటి గడప తొక్కాల్సిన అవసరం లేదన్నారు. ఇక రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అన్న రాజశేఖర్ రెడ్డి.. రాజధాని మారితే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చెలరేగుతుందని హెచ్చరించారు. ఎనిమిది నెలల వైసీపీ పాలనతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని, నవరత్నాలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

Tags:    

Similar News