Kakinada: సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం దారుణం: బీజేపీ

పౌరసత్వ సవరణ చట్టం 2019 ను కాకినాడ నగరపాలక సంస్థలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం సమంజసం కాదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

Update: 2020-02-24 12:26 GMT

కాకినాడ: పౌరసత్వ సవరణ చట్టం 2019 ను కాకినాడ నగరపాలక సంస్థలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం సమంజసం కాదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు పట్టణంలోని పైడా శ్రీ నివాస్ కళ్యాణమండపంలో సోమవారం బీజేపీ కాకినాడ నగర అధ్యక్షుడు రామ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ... పౌర సత్వ సవరణ చట్టానికి పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ పార్టీల ఎంపీలుల మద్దతు తెలిపారని... కానీ రాష్ట్రంలో వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు.

సీఏఏ భారత పౌర సత్వ సవరణ చట్టం అమలు కచ్చితంగా చెయ్యాలని... అందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పూర్వ అధ్యక్షులు యానిమిరెడ్డి మాలకొండయ్య , నగర అధ్యక్షులు చిట్నీడి శ్రీనివాస్, పార్టీ నాయకులు గట్టి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News