Payakaraopeta: బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు: తోట నగేష్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహ నారాహిత్యంతో ఉన్నారని మాజీ జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్, బీజేపి నాయకుడు తోట నగేష్ అన్నారు.

Update: 2020-04-14 02:20 GMT
Thota Nagesh

పాయకరావుపేట: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహ నారాహిత్యంతో ఉన్నారని మాజీ జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్, బీజేపి నాయకుడు తోట నగేష్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా కరోనాకి భయపడుతుంటే, ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించి దేశ ప్రజలను కాపాడారని అన్నారు. అదే తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసి రాష్ట్ర ప్రజలను కరోనా బారి నుండి కాపాడారని అన్నారు. అయితే జగన్ మాత్రం తన రహస్య జీఓల ద్వారా ఎన్నికల అధికారిని తొలగించి, కొత్త ఎన్నికల అధికారిగా కనగరాజ్ ని అర్జంటుగా నియిమించుకోవలసిన అవసరమేంటని ప్రశ్నించారు.

రాజ్యాంగ బద్దమైన విధులు నిర్వహించే అధికారిని జీఓల ద్వారా తొలగించడం జగన్ అజ్ఞానమని అన్నారు. రాజ్యాంగ పరమైన పధవులలో ఉన్నవారిని పార్లమెంట్ ఆమోదంతోనే తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొత్తగా నియమించబడిన ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారానికై గవర్నర్ దగ్గరకు మద్రాను నుంచి ఏపికి వచ్చినప్పుడు క్వారంటైన్ లో ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. పలుమార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినప్పటికీ జగన్ తీరులో మార్పు రాకపోగా అసహనంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. లాక్ డౌన్ ను పొడిగించాలని పలురాష్ట్రాలు కోరుతుంటే , జగన్ మాత్రం సడలింపుతో లాక్ డౌన్ అమలు చేయాలనడం బాద్యతా రాహిత్యమేనని అన్నారు.


Tags:    

Similar News