Nara Bhuvaneswari: అత్యవసర వైద్యం అందించడంలో ఏపీ ప్రభుత్వం విఫలైమంది
Nara Bhuvaneswari: జైల్లో సరైన వైద్యం అందడంలేదంటూ ట్వీట్ చేసిన భువనేశ్వరి
Nara Bhuvaneswari: అత్యవసర వైద్యం అందించడంలో ఏపీ ప్రభుత్వం విఫలైమంది
Nara Bhuvaneswari: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తన భర్తకు సరైన వైద్య చికిత్స అందించడంలేదని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు అత్యవసరంగా వైద్యాన్ని అందించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు భువనేశ్వరి. చంద్రబాబు క్షేమం గురించి ఆందోళనగా ఉందని ట్వీట్ చేశారు. ఆయన ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని తెలిపారు. ఇంకా అలానే జరిగితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నట్లు తెలిపారు భువనేశ్వరి. జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో భయంకరమైన పరిస్థితులు తన భర్తకు ముప్పు కలిగించేలా ఉన్నాయని ట్విటర్ లో తెలిపారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.