ఏపీలో ఆధార్ మాదిరిగానే భూధార్!
రెవెన్యూ శాఖ లీలలు అందరికీ తెలిసిందే. మనకు భూమి ఉంటే పాసుపుస్తకంలో ఉండదు... పాసు పుస్తకంలో భూమి ఉంటే క్షేత్రస్థాయిలో ఉండదు.
రెవెన్యూ శాఖ లీలలు అందరికీ తెలిసిందే. మనకు భూమి ఉంటే పాసుపుస్తకంలో ఉండదు... పాసు పుస్తకంలో భూమి ఉంటే క్షేత్రస్థాయిలో ఉండదు.తమ్మిని బమ్మి, బమ్మిని తమ్మిని చేయగల సమర్ధులు. దీంతో పాటు తను అమ్మకం చేయకున్నా, వేరే వారు కొనుగోలు చేసుకున్నట్టు రిజిస్ర్టేషన్ చేసుకున్న సందర్భాలున్నాయి. ఈ విధంగా కొంతమంది అధికారుల వల్ల రైతులు తమ భూముల వివరాల నమోదు తదితర పనులు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం దేశ మంతా ఒకే నెంబరు కలిగి ఉండే ఆధార్ మాదిరిగా భూధార్ ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొత్తగా వచ్చిన టెక్నాలజీ ద్వారా భూములన్నింటినీ రీ సర్వే చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వీటికి అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేసి, పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తోంది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంతా సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మనుషులకు ఆధార్ ఉన్నట్లు గానే.. భూములకు కూడా గుర్తింపు ఉండాలని.. అందుకే ప్రతీ భూమిని గుర్తించి వాటికి 'భూధార్' నెంబర్ కేటాయించాలని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి జీవో జారీ చేశారు.
అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటివ్ రిఫరెన్స్ స్టేషన్స్(కార్స్) టెక్నాలజీ ద్వారా భూములను రీసర్వే చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, రాష్ట్రమంతా భూసర్వేలో భాగంగా మొదటిదశ పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తొలుత రీసర్వే చేయనుండగా.. దీని కోసం ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో పెట్టిన రూ. 200.15 కోట్లకు ఆమోదం తెలపాలని సర్వే సెటిల్‌మెంట్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు